మన పయనం ఎటువైపు? ఆరిపోతున్న దీపాన్ని ఆర్. టి.ఇ నిలబెట్టాలి-MAHESH

13/05/2013 14:21

 

 మన పయనం ఎటువైపు?

                 

                    ఉపాధ్యాయ మిత్రులారా, మన విద్యా వ్యవస్థ ఎటు పయనిస్తుందో, దానిని నిర్విర్యం చేస్తున్న బీజాల మూలాలు ఏమిటో ఒక్క క్షణం ఆలోచించండి. మన నిర్లిప్తత ఆసరాగా చేసుకుని,  అస్తవ్యస్త నిర్వహణ ద్వారా  వ్యవస్థను   ఏ కొందరి స్వార్ధానికో ఎరగావేసి తద్వారా ప్రభుత్వ విద్యాలయాల పట్ల ప్రజలలో నమ్మకం సన్నగిల్లే విధంగా ,అదే సమయములో ప్రాధమిక స్థాయి విద్యలో సైతం ప్రైవేటు సంస్థలను ప్రొత్సహించే విధంగా చాప క్రింద నీరులా జరుగుతున్న ప్రయత్నాలను గుర్తించి మనల్ని మనమే జాగృత పరుచుకుని మన మూలాలను మనమే కాపాడుకోవాల్సిన  సమయం ఇది కాదా?  ఆలోచించండి!

అయితే  ఈ  క్రింది వాస్తవాలును ఒక్కసారి పరికించండి.

 

* విద్యలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం అంటే ప్రభుత్వం తన భాధ్యతను తగ్గించుకొనే ప్రయత్నం కాదా?*

 

*  కారణాలు ఏమైనప్పటికి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే MEO  నియామకాల జాప్యం వల్ల నిజంగా నష్టపోతుంది ఎవరు?

          ప్రాధమిక విద్య కాదా?

*ప్రాధమిక విద్యలో  ప్రతి సంవత్సరం ఒక క్రొత్త అంశము ప్రవేశపెట్టి దాని ద్వారా సాధిస్తున్నామనుకొంటున్న ఫలితాలులో వాస్తవికత ఎంత శాతం?

 

*ఒక చిన్న ఉదాహరణగా సంత్సరం మొదట D గ్రేడు  చివర గ్రేడు మరుసటి సంవత్సరం మరలా  మొదట గ్రేడు.. ఎక్కువ  

   శాతం ఈ గణాంకాలే..ఎవరికోసం ఈ నివేధికలు ?

      ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ...ఎన్నెన్నో

 

               మనలో నిబద్దతతో ,అంకితభావంతో  పనిచేయు   ఉపాధ్యాయులు ఉన్నచోట కూడా ఆశించిన రీతిలో నమోదు పెంచలేకపోవటానికి  కారణాలలో మర్రి వృక్షంలా మనల్ని కబళించబోతున్న ప్రైవేటు వ్యవస్థ కూడా ఒకటి  కాదా?

ఈ క్రింది వాస్తవాలను ఒకసారి గమనించండి;-

 

*రాజ్యాంగములోని ఆర్టికిల్ 30 క్లాజ్ 1ప్రకారం ఒక ప్రైవేటు పాఠశాలకు రికగ్నైజేషన్  ఇవ్వాలంటే ఆ ప్రదేశమునకు ఆ పాఠశాల వాస్తవంగా అవసరం ( serves a real need) అయి ఉండాలి మరియు అప్పటికే అక్కడ నిర్వహించబడుతున్న పాఠశాల నమోదుపై ప్రభావం చూపకూడదు

 -- మన పాఠశాలలు ఇన్ని అందరికీ అందుబాటులో  ఉండగా క్రొత్తగా వాటికి పనిగట్టుకుని  గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ..ఎందుకు...ఎవరి ప్రయోజనం కోసం...?

 

*ప్రైవేటు పాఠశాల ,  సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ( 21 of 1860)  లో ఒక సొసైటీ గా రిజిస్టర్ కాబడి ఉండాలి మరియు  అది ఒక వ్యక్తికి గాని , వ్యక్తుల సమూహానికి గాని ఆదాయము కొరకు నడపరాదు

  ఇది వాస్తవానికి ఎంత దూరం ?   ఇది తెలిసికూడా ఉపేక్షిస్తుంది ఎవరు ?    ప్రోత్సహిస్తుంది ఎవరు?

 

ప్రైవెటు పాఠశాలల పనివేళలు ,పనిదినాలు ప్రభుత్వ ఆదేశములకు అనుగుణంగా ఉండాలి.

    -- కాని జూన్ 12 దాకా తెరవకుండా ఉండే సంస్థలు ఎన్ని.,? వాటిని చూసీ చూడనట్లు వదులుతున్నది ఎవరు?

 

* జీఓ నం. 2/2007  ప్రకారము 2009 కల్లా ప్రతి పాఠశాలకు RCC బిల్డింగ్ ఉండాలి.

 కాని ఈ నాటికి కూడా  వాళ్లు బడ్డీ కొట్టుల లాంటి రేకుల షెడ్డులు  చూపించినా  గుర్తింపు  వస్తుంది అంటే లోపం ఎక్కడ ఉంది?

 

 *ఒక్కో పిల్లాడికి  6-8 చ.. కూర్చునే స్థలం ఉండాలి

 

 *2000/1000 చ,మీ. ఆటస్థలం ఉండాలి

 

*లైబ్రరీ, కంప్యూటర్ రూం, స్టాఫ్ రూమ్,

 

*ఇండోర్ ఆటలకొరకు 350 చ,మీ. పై కప్పు గల  పెద్ద హాలు

     

  ---    ఒక పాఠశాలకు గుర్తింపునివ్వాలంటే ఇవన్నీ ఉండాలనే  నిబంధనలను జీ ఓ లకే

      పరిమితం చేసి  అవి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి అంటే  తప్పు జరుగుతుంది ఎక్కడ ,లోపం ఎవరిది?

 

*గుర్తింపు కోసం  Part-IV Fire protection act 1997  ప్రకారం అగ్నిమాపకదళ0 దృవీకరణ , అగ్ని నిరోధక పరికరాలు కలిగి ఉండాలి.  భవనం నిర్మాణం పై ఇంజినీర్ దృవీకరణ  ఉండాలి

     --మండల కేంద్రాలలో అగ్గిపెట్టెలలాంటి పాఠశాలల కూడా ఇవన్నీ వస్తున్నాయంటే .....ఆలోచించండి ?

 

*Cir.memo; 21748/01/97/16-2-1998 , రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటి  ప్రకారం పార్కింగ్ స్థలం ,వాహనం మెయింటెనెన్స్ ఉండాలి.

వాస్తవాని అలా ఉన్నవి ఎన్ని?

         

    మిత్రులారా ఒకరిని విమర్శించటమో  లేక మన లోపాలు ని సమర్ధించుకోవటమో ఈ వ్యాస ఉద్దేశ్యం కాదు.ఒక ప్రవేటు పాఠశాల గుర్తింపుకు ఇవన్నీ అవసరం అని నిర్ధారించినపుడు వాటిని మన పాఠశాలలో అమలు చేయాల్సిన అవసరం ఉంది కదా!

            బోధనాఅ సామర్ధ్యానికి మన ఉపాధ్యాయులలో కొరత లేదు. అటువంటప్పుడు  ప్రవేటు వాటికి గుర్తింపు ఇవ్వటానికి నిబంధనలు  ఖచ్చితంగా పాటించటం ఎంత అవసరమో అదే సమయంలో ఆ నిబంధలన్నింటిని మనపాఠశాలలో అమలు చేస్తే మన వ్యవస్థలో మంచిమార్పు  వస్తుందని నా అభిప్రాయం.

          ఏది ఏమైనా లోపం ఎక్కడఉందో -వాస్తవం ఏమిటో ఆలోచించండి!. ఈ సమస్యకు మూలం ఎక్కడుందో తెలిస్తే సగం పరిష్కారం దొరికినట్లే


 

  ఆరిపోతున్న దీపాన్ని ఆర్. టి.ఇ నిలబెట్టాలి

 

ఉపాధ్యాయ మిత్రులారా,

               

                 నిర్వీర్యమైపోతున్న విద్యావ్యవస్థను నిలబెట్టాలంటే బదిలీ మార్గదర్శకాలు మార్చాల్సిందే. తీసుకునే మార్గదర్శకాలు విద్యావ్యవస్థకు ఆదర్శంగా ,స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి . పని చేసిన వ్యక్తికిమేలు జరిగితే అది మరి కొంతమందికి ప్రేరణ ఇస్తుంది.

 

              ప్రస్తుతం ఆర్.టి.ఇ  పాఠశాల మౌలిక వసతులు ,పిల్లలకు రకరకాల ప్రోత్సాహకాలును ఇస్తుంది.    కాని దానిలో ఉపాధ్యాయుల ,   పిల్లల నిష్పత్తి పైనే కాక బదిలీబదిలీ మార్గదర్శకాలు పైన కూడా దృష్టి పెట్టి వ్యవస్థ చైతన్య వంతం అయ్యేటందుకు ఉపయోగపడాలి.   మన బదిలీలలలో జరుగుతున్న రేషనలైజేషన్ ప్రక్రియలో కొన్ని అసంబద్ధమైన అంశాలును ,కొన్ని ప్రతిపాదనలను మీ ముందుకు తెస్తున్నాను. 

           

                రేషనలైజేషన్ ( పిల్లలని పోగొట్టి నందుకు ఇచ్చిన అందమైన పేరు)కి  15 పాయింట్లు ఇస్తున్నారు . మరి ఎంతో కస్టపడి "బడేగుడి" గా భావించి పిల్లల సంఖ్యను పెంచిన ఉపాధ్యాయులకుప్రోత్సాహం ఇవ్వక పిల్లలను తగ్గించిన వారికి 15 పాయింట్లు అప్పనంగా ఇస్తే వ్యవస్థకు మనం ఇచ్చే సందేశం ఏమిటి? మార్గదర్శకం ఏంటి ? స్ఫూరి ఏంటి? ప్రోత్సాహం ఏంటి? ఆలోచించండి. 

 

                ఒక్క పాయింటుకే మండలాలు మారిపోయే పరిస్థితిలో పిల్లలను పోగొట్టిన వారికి 15 పాయింట్లు ఇస్తే పని చేసిన్స్ వారు జిల్లా సరిహద్దులకు ,అడవుల్లో పోవలిసిందేనా? ఇది అరాచకంకాదా?

           

                       రోల్ 80 మంది దాటిన పాఠశాలలకు ఒక LFL HM ను ఇస్తున్నారు.  1:30  న్జిష్పత్తిలో అప్పటికే పని చేస్తున్న ముగ్గురు  SGT   లలో ఒక పోస్టు పోయి  LFL HM వస్తునారు . అంటే కష్టపడి పని చేస్తున్న ముగ్గురు నుండి ఒకరిని తీసివేయటం మనం ఇచ్చే కానుక ? కష్టపడేవారికి మనం ఇచ్చే స్ఫూరి ఇదేనా? అలా కాకుండా LFL  పోస్టు అధనంగా ఇస్తే ప్రేరణ బాగుంటుంది కదా ? పనిని పంచుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తారు కదా !

 

           మండలంలో 10 మంది లోపు ఉన్న పాఠశాలలు, అసలు పిల్లలే లేని పాఠశాలలని అలాకొనసాగనీయటం కన్నా  ఆ పాఠశాలలను Hit List లో పెట్టి  ఒక సంవత్సరంలో పిల్లలను పెంచుతామన్న ఉపాధ్యాయులకు అక్కడ పోస్టింగ్ ఇచ్చి పెంచిన యెడల ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి పాఠశాలల  అభివృద్ధికి .ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని స్ఫూరిని ఇవ్వవచ్చుకదా?

            ఒకవేళ పిల్లలను పెంచని యెడల ఆ ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ తీసివేసే నిబంధ్నతో పొస్టింగ్ ఇవ్వాలిప్రిఫరెన్షియల్ కేటగిరీ వారికి ముందు గా అవకాశం ఇచ్చినట్లు గా ఎక్కువు శాతం మందిని పిల్లల ను పెంచి పాఠశాలల అభివృద్దికి పాటుపడిన  వారికి కూడా ఈ కేటగిరీ లోకి తీసుకు వస్తే ఒక మంచి ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చి మనవ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది.

 

              ఉపాధ్యాయుల పని తీరును బట్టి పెంచిన పిల్లల సంఖ్యను బట్టి వివిధ స్థాయిలలో పాయింట్లు కేటాయించిన వారి పనితీరు పెరిగి మన వ్యవస్థకు మరియు రాబోయే తరానికి ఒక మంచి దశ-దిశను నిర్ధేశించినవారం అవుతాము.

                 పనివాచేసేవాడు జీతానికి ఎలా అర్హుడో అలానే పిల్లల సంఖ్యను పెంచినవావారిని పాయింట్లుకు అర్హులుగా చేయాలి.

ఉన్నతపాఠశాలలో పిల్లల ప్రగతికి పాయింట్లు ఇస్తున్నట్లు,ప్రాధమిక పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచినందుకు పాయింట్లు ఇచ్చినట్లైయితే ఉపాధ్యాయులలో నైరాశ్యాన్ని తొలగించి మరింత ఉత్సాహంతో, పోటీతత్వంతో  పని చేసేటందుకు దోహదపడుతుంది.

  అలా అయితేనే మన ప్రాధమిక పాఠశాలలు ప్రకాశిస్తాయి,ఫరిడమిల్లుతాయి, బలోపేతం అవుతాయి. 

                                    ఒక దోషికి శిక్ష పడకపోయినా నిర్దోషికి శిక్ష పడకూడదు.అలాగే రేషనైలేజేషన్ (పిల్లలను పోగొట్టినవారికి)కు 15  పాయింట్లు ఇస్తున్నారు .పిల్లలసంఖ్యను పెంచిన వారికి ఏ పాయింట్లు లేవు.ఇది దారుణమైన అంశముగా భావిస్తున్నాను.  

                  గీజూబాయి చెప్పినట్లు ప్రాధమిక స్థాయిలో ఉపాధ్యాయుల ప్రవర్తనలో మార్పు రానంతవరకు ఎన్ని కొత్త పోకడలు వచ్చినా, శిక్షణలు ఇచ్చినా ఉపయోగం వుండదు.

                   వీటన్నిటి దృష్ట్యా ఒక స్ఫూర్తి, ఒక చైతన్యం ,ఒక ఆదర్శం కావాలంటే  పిల్లలసంఖ్యను పెంచే ఉపాధ్యాయులకు కూడా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను.